రైతులకు కొత్త రుణాలు ఇస్తాం: సింగిల్ విండో చైర్మన్ నరసింహ రెడ్డి

by Mahesh |
రైతులకు కొత్త రుణాలు ఇస్తాం: సింగిల్ విండో చైర్మన్ నరసింహ రెడ్డి
X

దిశ, నిజాంసాగర్: రైతులకు కొత్త రుణాలు ఇస్తామని సింగిల్ విండో చైర్మన్ నర్సింహారెడ్డి అన్నారు. శనివారం నిజాంసాగర్ మండలం అచ్చంపేట సింగల్ విండో మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ ఖర్చులను సింగల్ విండో సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ చదివి వినిపించారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ.. సింగల్ విండో ఆధ్వర్యంలో కొత్త రైతులకు పంట రుణాలు ఇప్పిస్తామన్నారు. పట్టా భూమి కలిగిన రైతులకు ఎకరానికి 45 వేల రూపాయలు, ప్రభుత్వ భూమి పట్టా కలిగిన రైతులకు ఎకరానికి 30 వేల రూపాయలు పంట రుణాలు ఇస్తామన్నారు.

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తామన్నారు. అలాగే గోర్గల్ గ్రామ గేట్ వద్ద ఫంక్షన్ హాల్ నిర్మాణం పనులు పూర్తయ్యాయని త్వరలో ప్రారంభిస్తామన్నారు. 363 మందికి కోటి 48 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగిందన్నారు. తిరిగి 278 మందికి కోటి 36 లక్షల మందికి రుణాలు ఇప్పించామన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో ఉపాధ్యక్షుడు గుమస్త శ్రీనివాస్, మాజీ సి డి సి చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి, గజ్జల రాములు, గవ్వల సంగయ్య, సత్యనారాయణ, రాజ్యం సాయిలు దేవేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రమేష్ గౌడ్, సిబ్బంది రాహుల్, కృష్ణ, బాబా సింగ్, లక్ష్మీకాంత్, నర్సింలు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story