కాంగ్రెస్‌లో కొత్త తలనెప్పి.. ఇక్కడే ఉంటానంటూ ఆమె లాబీయింగ్.. మాకొద్దంటున్న తెలంగాణ నేతలు!

by karthikeya |   ( Updated:2024-09-29 02:43:25.0  )
కాంగ్రెస్‌లో కొత్త తలనెప్పి.. ఇక్కడే ఉంటానంటూ ఆమె లాబీయింగ్.. మాకొద్దంటున్న తెలంగాణ నేతలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ తన పదవిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. తనను తెలంగాణ ఇన్‌చార్జి బాధ్యతలను నుంచి తప్పించవద్దని ఏఐసీసీలో పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. కొంత కాలంగా రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్‌చార్జిని నియమిస్తారని, రాహుల్‌కు సన్నిహితంగా ఉన్న ఉత్తరాదికి చెందిన ఓ ఎంపీకి బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న దీపాదాస్ తన పోస్టును కాపాడుకునే పనిలో పడినట్టు టాక్ నడుస్తున్నది.

తెలంగాణ నుంచి కదిలించొద్దని అప్పీల్..

రాష్ట్ర ఇన్‌చార్జిగా బాధ్యతల నుంచి దీపాదాస్‌ను తప్పించేందుకు ఏఐసీసీలో ప్రయత్నాలు జరిగాయి. రాహుల్‌కు సన్నిహితంగా ఉండే ఓ ఎంపీ పేరును పైనల్ చేసినట్టు ప్రచారం కూడా జరిగింది. ఈ విషయం తెలుసుకున్న దీపాదాస్ తాను కొంతకాలంపాటు తెలంగాణలో పనిచేస్తానని అప్పీలు చేశారు. అందుకు ఏఐసీసీ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. దీనితో పూర్తిస్థాయి ఇన్‌చార్జిని అపాయింట్ చేయకుండా, కేరళకు చెందిన మాజీ ఎంపీ విశ్వనాథన్‌కు టీపీసీసీ అదనపు బాధ్యతలను అప్పగించింది. దీనితో దీపాదాస్‌ను ఇప్పట్లో కదలించే ఆలోచనను పక్కన పెట్టిందని ఆమెకు సన్నిహితంగా ఉండే లీడర్లు చెపుతున్నారు. కానీ.. సమయం, సందర్భం చూసుకుని కొత్త లీడర్‌ను అపాయింట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతున్నది.

దీపాదాస్ తీరుపై విమర్శలు!

దీపాదాస్ పార్టీ వ్యవహారాల పేరుతో ప్రభుత్వ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా నామినేటెడ్ పదవుల భర్తీలో విషయంలో అమె తన పరిధిని దాటి ప్రవర్తించారనే ఆరోపణలు వస్తున్నాయి. తను సూచించిన లీడర్లకు, తను చెప్పిన పదవులు ఇవ్వాలని పట్టుపడుతున్నట్టు ప్రచారం ఉంది. గతంలో కూడా ఆమె వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తనకు గవర్నమెంట్ నుంచి సెక్యూరిటీ కావాలని, తనకు తెలియకుండా పార్టీలో ఏ కార్యక్రమం జరగొద్దని కండీషన్ పెట్టినట్టు ప్రచారం జరిగింది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. సదరు ఎమ్మెల్యేల చేరికలు తన సమక్షంలోనే జరగాలని కండీషన్ పెట్టడంతో, ఆమె అపాయింట్మెంట్ తీసుకుని ఎమ్మెల్యేల చేరికలను పూర్తి చేశారనే చర్చ జరిగింది. ఆమె డిమాండ్ల చిట్టా విని విసిగిపోయిన కొందరు లీడర్లు ఏఐసీసీకి ఫిర్యాదు చేసి, కొత్త ఇన్ చార్జిని అపాయింట్ చేయాలని కోరినట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed