గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ 2024 రన్

by Mahesh |
గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ 2024 రన్
X

దిశ, శేరిలింగంపల్లి: రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు గాను అవగాహన (Pink Power 2024 run)రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ జెండా ఊపి ప్రారంభించారు. ఒకేసారి 3కె, 5కె, 10 కె రన్ నిర్వహించారు. ఈ రన్ లో 5 వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొన్నారు. గచ్చిబౌలి స్టేడియం నుంచి విప్రో సర్కిల్, టీఎన్జీవో కాలనీ మీదుగా రన్ కొనసాగింది. రన్నర్స్ ఉత్సాహంగా పరుగులు తీశారు. ఇంత పెద్ద మొత్తంలో పింక్ మారథాన్ లో రన్నర్స్ పాల్గొనడం వరల్డ్ రికార్డు అని నిర్వాహకులు తెలిపారు. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ మారథాన్ రన్ నిర్వహిస్తున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఎం.ఇ.ఐ.ఎల్ (మెయిల్) ఫౌండేషన్, సుధా రెడ్డి ఫౌండేషన్ సంయుక్తంగా పింక్ పవర్ రన్ 2024' కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ మారథాన్ లో పాల్గొన్న వారికి న్యూట్రీషన్ కిట్స్ పంపిణీ చేశారు.

Advertisement

Next Story