- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బద్వేలులో ఉనికిని కాపాడుకున్న బీజేపీ
దిశ, ఏపీ బ్యూరో: బద్వేలు ఉపఎన్నికల్లో బీజేపీ తన ఉనికిని కాపాడుకుంది. గత ఎన్నికల్లో కేవలం వెయ్యిలోపే ఓట్లు సాధించిన బీజేపీ ఈ ఉపఎన్నికలో సత్తా చాటింది. టీడీపీ, జనసేన పోటీకి దూరంగా ఉండటంతో కేవలం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మాత్రమే పోటీ చేశాయి. అయితే బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ 21,678ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థికి 21వేల ఓట్లు రావడంపట్ల ఆ పార్టీ నేతలు సంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లతో విజయం సాధించిందని బీజేపీ అభ్యర్థి పనతల సురేశ్ ఆరోపించారు. వైసీపీ నేతలు పోలింగ్ బూతుల్లోకి చొరబడ్డారని..వేల కోట్లు ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. ఓటర్లను డబ్బుతో ప్రలోభాలకు గురి చేశారన్నారు. పోలీస్ వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకుని దొంగ ఓట్లు వేయించారని విరుచుకుపడ్డారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఒక్క బద్వేలులోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ అరాచక పాలనను అంతం చేసేందుకు బద్వేలు ఉప ఎన్నికే నాంది కాబోతోందని పనతల సురేశ్ హెచ్చరించారు.