మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!

by Shyam |
మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజీవ్ స్వగృహంలో నివాసముండే 10ఏళ్ల మైనర్ బాలికపై 55 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళ్తే.. ఇంటి ముందు ఆడుకుంటున్న మైనర్ బాలికను కరీం అనే వ్యక్తి కాకరకాయలు తెంపి ఇస్తానని చెప్పి అపార్ట్‎మెంట్‎లోకి తీసుకెళ్లి అత్యాచారాయత్నం చేశాడు. అనంతరం ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన బాలిక తల్లిదండ్రులకు విషయం తెలపింది. దీంతో కరీంకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story