- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 30 మందికి తీవ్ర గాయాలు
దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా (Annamayya District)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును, సిమెంట్ లోడ్ లారీ (Cement load lorry) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సూపర్ లగ్జరీ బస్సు (Super luxury Bus) వేలూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా రామాపురం మండలం మేదరపల్లి చెక్ పోస్టు వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో జేసీబీ సాయంతో ఆర్టీసీ బస్సును, లారీని పక్కకు తీశారు. కడప-రాయచోటి (Kadapa-Rayachoti) మధ్య నిలిచిపోయిన ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ప్రమాదానికి నిద్రమత్తు, అతివేగమే కారణమంగా ప్రాథమికంగా అంచనా వేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే వాహనదారులకు పోలీసులు కీలక సూచనలు చేశారు. డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అతివేగం ప్రమాదకరమని తెలిపారు. తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు డ్రైవింగ్ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.