- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PKL 2024 : తెలుగు టైటాన్స్ జోరు.. హ్యాట్రిక్ విజయం నమోదు
దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జోరు కొనసాగుతోంది. తాజాగా ఆ జట్టు హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. నోయిడాలో గురువారం జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌పై 29-31 తేడాతో గెలుపొందింది. ఫస్టాఫ్‌లో పూర్తి ఆధిపత్యం టైటాన్స్‌దే. వరుస పాయింట్లు సాధించిన ఆ జట్టు ఫస్టాఫ్‌లో 19-10తో ఆధిక్యంలోని నిలిచి పట్టు సాధించింది. అయితే, సెకండాఫ్‌లో బెంగాల్ బలంగా పుంజుకుంది. ఓ సారి టైటాన్స్‌ను ఆలౌట్ కూడా చేసింది. సెకండాఫలో బెంగల్ 20 పాయింట్లు సాధిస్తే.. టైటాన్స్ 12 పాయింట్లే నెగ్గింది. అయితే, చివరి వరకూ టైటాన్స్ ఆధిక్యాన్ని కాపాడుకోవడంతో విజయతీరాలకు చేరింది. విజయ్ మాలిక్ 14 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో టైటాన్స్(42 పాయింట్స్) పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అగ్రస్థానంలో ఉన్న హర్యానా స్టీలర్స్(46)కు కేవలం 4 పాయింట్ల దూరంలోనే ఉన్నది. మరోవైపు, హర్యానా స్టీలర్స్ మళ్లీ గెలుపు బాటపట్టింది. గురువారం జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా 32-26 తేడాతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.