- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Russia : నెక్ట్స్ టార్గెట్ అమెరికా మిలిటరీ బేస్.. రష్యా ప్రకటన
దిశ, నేషనల్ బ్యూరో : ఉక్రెయిన్‌పై రష్యా(Russia) విరుచుకుపడింది. అమెరికా అందించిన లాంగ్ రేంజ్ మిస్సైళ్లను తమ దేశంపైకి ఎక్కుపెట్టినందుకు కీవ్‌పై పుతిన్ సేన ప్రతీకారం తీర్చుకుంది. తొలిసారిగా ఉక్రెయిన్‌పై ఖండాంతర క్షిపణితో రష్యా దాడిచేసింది. గురువారం మధ్యాహ్నం ఈ ఎటాక్ జరిగింది. ఇది జరిగిన టైంలో రష్యా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఉన్నారు. మీడియాతో మాట్లాడుతుండగా ఆమెకు ఉన్నతస్థాయి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఖండాంతర క్షిపణి దాడి గురించి ఎలాంటి కామెంట్స్ చేయొద్దని, మౌనంగా ఉండాలని ఫోనులో ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
మా టార్గెట్‌లో పోలండ్‌లోని నాటో మిలిటరీ బేస్ : మారియా
రష్యాకు 5వేల కిలోమీటర్ల దూరంలోని పోలండ్(Poland) దేశపు రెడ్జికోవో ప్రాంతంలో అమెరికా నవంబరు13న ప్రారంభించిన సైనిక స్థావరం(US military base)పై మారియా జఖరోవా ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని తమ దేశం అత్యాధునిక ఆయుధాలతో ధ్వంసం చేసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చారు. రష్యా సిద్ధం చేసుకున్న ప్రధాన శత్రు లక్ష్యాల జాబితాలో పోలండ్‌లోని అమెరికా మిలిటరీ బేస్ కూడా ఉందని మారియా స్పష్టం చేశారు. రష్యా, దాని పరిసర దేశాలలో అస్థిరతను సృష్టించే కుట్రతో అమెరికా సారథ్యంలోని నాటో కూటమి పోలండ్‌లో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసిందని ఆమె ఆరోపించారు. రష్యా వార్నింగ్‌తో అలర్ట్ అయిన పోలండ్ కీలక ప్రకటన విడుదల చేసింది. కేవలం తమ దేశ ఆత్మరక్షణ కోసమే ఆ మిలిటరీ బేస్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అక్కడ న్యూక్లియర్ మిస్సైల్స్ లేవని తేల్చి చెప్పింది.