- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వ్యక్తిగత జీవితంలో చెడు అలవాట్లు.. కానీ అక్కడికి సమయానికి వెళ్లేవాడిని’.. నటుడు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఓ బాలీవుడ్ హీరో తన వ్యక్తిగత జీవితం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం సితారే జమీన్ పర్(Sitare Zameen Par) చిత్ర షూటింగ్‌లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. అలాగే డ్రీమ్ ప్రాజెక్టుగా మహాభారతం(Mahabharatam) తీసుకురానున్నారు. అయితే దీని గురించి మాట్లాడుతూ.. డ్రీమ్ ప్రాజెక్ట్ విషయంలో అయితే చాలా రెస్పాన్సిబిలిటీతో ఉన్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా భయం కూడా ఉందని అన్నారు. ఎలాంటి మిస్టేక్ లేకుండా మూవీని తెరకెక్కించాలనుకుంటున్నానని వెల్లడించారు. ఇండియన్స్‌గా మహాభారతం స్టోరీ మన బ్లడ్‌లోనే ఉంది కాబట్టి.. ఈ ప్రాజెక్ట్ నాపై బాధ్యతను పెంచిందని చెప్పుకొచ్చారు. ఈ మూవీతో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికే చూపించాలనుకుంటున్నానని, ప్రతి ఒక్కరూ సినిమా చూశాక గర్వపడేలా చేయాలని భావిస్తున్నానని తెలిపారు.
తను కష్టపడేది పడతాను.. వర్క్ చేస్తాను కానీ ఏం జరుగుతుందో చూడాలంటూ మాట్లాడారు. అలాగే ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలో తను చేసిన మిస్టేక్స్ గురించి కూడా చెప్పుకొచ్చారు. మరీ ఈ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ ప్రముఖ హీరో ఆమిర్ ఖాన్(Bollywood actor Aamir Khan). ఈయన నానా పటేకర్(Nana Patekar)తో కలిసి ఓ ఇంటర్వ్యూకు హాజరై.. వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోయేదని అన్నారు. కానీ మూవీ షూటింగ్స్‌కు మాత్రం టైంకు వెళ్లేవాడినని వెల్లడించారు. అంతేకాకుండా మరో చెడు అలవాటు ఉండేదని.. మద్యం(alcohol), పైప్ స్మోకింగ్(Smoking) చేసేవాడినని పేర్కొన్నారు. ఓ సందర్భంలో తప్పు తెలుసుకున్నానని.. అప్పుడు పుల్‌స్టాప్ పెట్టలేకపోయానని అన్నారు. కానీ తనలో మార్పు రావడానికి ముఖ్య కారణం సినిమానే అని వివరించారు. మూవీ ఒక మెడిసిన్ లాంటిదని ఆమిర్ ఖాన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ బాలీవుడ్ నటుడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.