GST: సెకండ్ హ్యాండ్ కార్లపై 18 శాతం జీఎస్టీ.. కేవలం వీరికి మాత్రమే..!

by Maddikunta Saikiran |
GST: సెకండ్ హ్యాండ్ కార్లపై 18 శాతం జీఎస్టీ.. కేవలం వీరికి మాత్రమే..!
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అధ్యక్షతన ఇటీవలే 55వ జీఎస్టీ కౌన్సిల్(GST Council) సమావేశం జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్(Rajasthan) రాష్ట్రం జైసల్మేర్(Jaisalmer) వేదికగా జరిగిన ఈ మీటింగ్ లో కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది. పలు వస్తువలను జీఎస్టీ నుంచి మినహాయించగా.. కొన్ని ప్రొడక్ట్స్ పై జీఎస్టీ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో పాత(Old), సెకండ్ హ్యాండ్(Second Hand) కార్ల విక్రయంపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతూ జీఎస్టీ మండలి నిర్ణయించింది. ఇది యూజ్డ్ ఎలక్ట్రిక్ వాహనాలకు(EV) కూడా వర్తిస్తుందని కౌన్సిల్ మీడియా సమావేశంలో వెల్లడించింది. ఇదిలా ఉంటే.. కేంద్రం తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే దీనిపై జీఎస్టీ కౌన్సిల్ తాజాగా క్లారిటీ ఇచ్చింది. జీఎస్టీ కింద నమోదుకాని వ్యక్తుల మధ్య జరిగే కార్ల విక్రయానికి ఇది వర్తించదని తెలిపింది. 18 శాతం ట్యాక్స్ కేవలం రిజిస్టర్ డీలర్(Registered Dealer) వ్యాపారులకే వర్తిస్తుందని పేర్కొంది. వ్యక్తిగతంగా సేల్(Sale) చేసే కార్లకు ఎలాంటి జీఎస్టీ ఉండదని వెల్లడించింది. అయితే డీలర్ చెల్లించిన ట్యాక్స్ మొత్తాన్ని తిరిగి కస్టమర్ల నుంచే వసూల్ చేస్తారని, పన్ను భారం వినియోగరులపైనే వేస్తారని పలువురు కేంద్రంపై మండిపడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed