- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dating and addiction : ‘డేటింగ్ యాప్’ వ్యసనం.. యువతలో పెరుగుతున్న కొత్త ధోరణి!
దిశ, ఫీచర్స్ : ప్రేమ, పెళ్లి, స్నేహం వంటి సంబంధాలన్నీ ఒకప్పుడు కేవలం ప్రత్యక్ష పరిచయాల ద్వారానే ఏర్పడేవి. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థతి లేదు. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారుతున్న ఇవాల్టి రోజుల్లో యువత ఆలోచనల్లో, ప్రవర్తనల్లో భిన్నమైన మార్పులు సంతరించుకుంటున్నాయి. సరికొత్త ధోరణులు పుట్టుకొస్తు్న్నాయి. కాగా ఇవి కొన్ని విషయాల్లో మేలు చేస్తున్నప్పటికీ, మరికొన్నిసార్లు కీడు చేస్తున్నవిగానూ ఉంటున్నాయి. అలాంటి వాటిలో ‘డేటింగ్ యాప్ లేదా ఆన్‌లైన్ డేటింగ్ సైట్లు’ కూడా ఒకటి. వీటిని వీక్షించే ధోరణి రిలేషన్‌షిప్ విషయంలో మేలు చేస్తున్నప్పటికీ, అతిగా యూజ్ చేయడమనేది వ్యసనంగానూ మారుతోందని నిపుణులు చెబుతున్నారు.
లవ్, రొమాన్స్, రిలేషన్‌షిప్ వంటి బంధాలకు ఇప్పుడు డేటింగ్ యాప్‌లు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఎలాంటి ముఖ పరిచయం లేపోయినా, ఎన్నడూ ప్రత్యక్షంగా కలుసుకోకపోయినా కొన్ని బంధాలు అల్లుకుపోతున్నాయి. అదే క్రమంలో సమస్యలకు, వ్యసనాలకు కూడా దారితీస్తున్నాయి. డేటింగ్ యాప్‌లు లేదా సైట్ల వినియోగమే ఇందుకు కారణం అవుతోందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వీటి ద్వారా సంబంధాలు సెట్ అవడం సంగతి పక్కన పెడితే, తరచుగా స్ర్కోల్ చేయడం, వాటిలోని ప్రొఫైల్స్ చూడకుండా ఉండలేకపోవడం అనేక మందిలో ఓ మానసిక రుగ్మతకు దారితీస్తోంది. ఎందుకంటే ఎలాంటి మ్యాచ్ సెట్ కాకపోయినా ఏదో ఒకరోజు సెట్ అవుతుందని తరచుగా అందులో నిమగ్నమైపోతుంటారు చాలా మంది. దీంతోపాటు ఇక్కడ టెంపరరీ రిలేషన్స్ కూడా సెట్ అయ్యే అవకాశం ఉన్నందున వాటిని స్క్రోల్ చేయకుండా ఉండలేని పరిస్థితిలో కూరుకుపోతోంది ఈతరం యువత. ఈ బలహీనతనే ‘డేటింగ్ యాప్ అడిక్షన్’గా పేర్కొంటున్నారు నిపుణులు.
పెరుగుతున్న వినియోగం
ఒక రీసెంట్ సర్వే ప్రకారం.. ప్రపంచంలో డేటింగ్ యాప్‌ల వినియోగంలో ఇండియా కూడా ప్రస్తుతం 5వ అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. ఐదారేండ్ల కిందట 20 మిలియన్ల మంది భారతీయులు మాత్రమే డేటింగ్ యాప్‌లను లేదా సైట్లను వినియోగించగా, 2024లో ఆ సంఖ్య 82.4 మిలియన్లు దాటింది. అదే సందర్భంలో వీటిని తరచుగా స్ర్కోల్ చేయడం లేదా వీక్షించడం కారణంగా యువతను పెడదారి పడుతున్న పరిస్థితులు కూడా నెలకొంటున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. ఇవి వినియోగదారులను శాశ్వతంగా ‘పే టు ప్లే’ లూప్‌లోకి లాగుతున్నాయని, కస్టమర్ల మ్యాచెస్ టార్గెట్ కంటే, కార్పొరేట్ లాభాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
సమస్యలకు మూలం
ఈ హర్మోని (eHarmony) సర్వే ప్రకారం.. డేటింగ్ యాప్‌లను, అలాగే ఆన్‌లైన్ సైట్లను యూజ్ చేస్తున్న ప్రతీ 10 మంది సింగిల్స్‌లో 9 మంది వాటికి అడిక్ట్ అవుతున్నారు. దాదాపు 48 శాతం మంది ప్రతి రోజూ పడుకునే ముందు ఈ యాప్‌లను స్వైప్ చేయనిదే నిద్రపోవడం లేదు. 39 శాతం మంది నిద్ర లేవగానే డేటింగ్ యాప్‌లను చెక్ చేస్తున్నారట. 12 శాతం మంది ఆల్రెడీ డేటింగ్‌లో ఉన్నప్పటికీ, అప్పటికే పెళ్లైనప్పటికీ కూడా డేటింగ్ యాప్‌లను చూడకుండా ఉండలేకపోతున్నారట. మరో 28 శాతం మంది వర్క్ ప్లేస్‌లలో కూడా డేటింగ్ యాప్‌లను స్వైప్ చేస్తున్నారు. దీనిని బట్టి డేటింగ్ యాప్ అడిక్షన్ ఏ లెవల్లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
పరిష్కారం ఏమిటి?
మానవ సంబంధాల్లో డేటింగ్ యాప్‌లు తెచ్చిన మార్పులన్నీ చెడ్డవే అని చెప్పలేం. కానీ వాటిని వినియోగించుకునే తీరు, అవగాహనా రాహిత్యం వంటివి వ్యసనాలకు, పెడధోరణులకు కారణం అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. అదే విధంగా వాటి నిర్వాహకులు కూడా యువతను తప్పుదో పట్టించడంలో ఎంతోకొంత పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే డేటింగ్ యాప్‌లు లేదా సైట్ల డిజైనింగ్ మ్యాచింగ్ అండ్ నోటిఫికేషన్ ఫీచర్లను యూజర్లను బాగా అట్రాక్ట్ చేసేలా రూపొందిస్తున్నాయి. వాటిని స్వైప్ చేస్తున్నప్పుడు వినియోగదారుల బ్రెయిన్ రివార్డ్ సిస్టమ్ యాక్టివేట్ అయినట్లు అనిపించి, తక్షణ సంతృప్తి ఏర్పడుతుంది. ఇదే యువతలో డేటింగ్ యాప్ అడిక్షన్‌కు దారితీస్తోందని నిపుణులు చెబతున్నారు. కొన్నిసార్లు యూజర్లను అట్రాక్ట్ చేసే టెక్నిక్స్, ట్రిక్స్ ప్లే చేస్తుండటంతో పలువురు స్వైప్ చేయకుండా ఉండలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వ్యసనంలో కూరుకుపోతున్నారు. అయితే ఈ వ్యసనం నుంచి బయటపడాలంటే వినియోగదారుల్లో స్వీయ అవగాహన వంటివి అవసరం అంటున్నారు నిపుణులు.