655 రైతు కుటుంబాలు సేంద్రియ సాగు చేయడం గర్వకారణం: భారత ఉపరాష్ట్రపతి

by Aamani |
655 రైతు కుటుంబాలు సేంద్రియ సాగు చేయడం గర్వకారణం: భారత ఉపరాష్ట్రపతి
X

దిశ కొల్చారం, కౌడిపల్లి: మెదక్ జిల్లాలో 655 రైతు కుటుంబాలు సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేయడం గర్వించదగ్గ విషయమని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ అన్నారు. బుధవారం ఉపరాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సతీమణి డాక్టర్ సుధీష్ ధన్ ఖడ్, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు లతో కలిసి కౌడిపల్లి మండలం తునికి శివారులోని రామానాయుడు కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన సేంద్రియ రైతుల ఆత్మీయ సమ్మేళనానికి ప్రత్యేక హెలికాప్టర్లో ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

కృషి విజ్ఞాన కేంద్రానికి చేరుకున్న ఉపరాష్ట్రపతి మొదట కృషి విజ్ఞాన కేంద్రంలో మొక్కలు నాటారు. అక్కడే ఏర్పాటు చేసిన సేంద్రియ ఎరువులకు సంబంధించిన స్టాల్స్ పరిశీలించారు.. అనంతరం కేవికే లోని వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం లో ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ సాగు పై దాదాపు 800 మంది రైతులతో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయ సాగు పద్ధతులపై పలువురు రైతులతో ఉప రాష్ట్రపతి, గవర్నర్ ముచ్చటించారు. అనంతరం ఉపరాష్ట్రపతి జగదీష్ దనకర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు మెదక్ జిల్లాలో 655 మంది రైతు కుటుంబాలు సేంద్రియ సేద్యం చేపట్టడంతో దేశంలోనే చరిత్ర సృష్టించారన్నారు. జిల్లాలోని కేంద్రీ రైతులందరికీ మూడు రోజుల పాటు డిల్లీలో నాకు అతిథులుగా రావాలి అని ఆహ్వానించారు.

మెదక్ జిల్లాలోని ఈ తునికి గ్రామం చిన్నది కాదు, నాకు మార్గ దర్శకం చేసిన గ్రామమన్నారు.మెదక్ జిల్లాలో సేంద్రియ వ్యవసాయం చేసిన రైతులు, గ్రామ పంచాయతీ సభ్యులు నా ప్రత్యేక అతిథులు.. వారికి ఢిల్లీ లో ఆతిధ్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికాసానికి లాల్ బహదూర్ శాస్త్రి, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ నినాదంతో వాజ్ పాయ్, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై ఆను సందాన్ నినాదంతో ప్రధాని మోదీ కృషి చేస్తున్నారన్నారు. రాబోయే కొద్ది కాలంలోనే భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతున్నది. అని తెలిపారు. 2001 లో అప్పటి ప్రధాని వాజ్ పేయి నేతృత్వంలో కిసాన్ దివస్ ను ప్రకటించారు. త్వరలో కిసాన్ దివస్ రజతోత్సవం జరుపుకోబోతున్నది.

దేశంలోని 730 పైచిలుకు కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. 150 పై చిలుకు ఐకార్ సంస్థలు కిసాన్ దివస్ రజతోత్సవ వేడుకల్లో భాగస్వాములు కావాలి అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో రైతుల భాగస్వామ్యం ఉంటేనే దేశం పురోభివృద్ధి చెందుతుంది అన్నారు. దేశంలోని ఇంధన, సహజ వనరులను అవసరం మేరకే వినియోగించుకోవాలి అని రైతులకు సూచించారు. గ్రామీణ వ్యవస్థలో తమ గ్రామాల్లో పండించిన పండ్లు, కూరగాయలను ఒక యూనిట్ గా ఏర్పాటు చేసుకుని అక్కడే వినియోగించుకోవాల అని ఆ ప్రాంతంలోనే విక్రయిస్తే ఆ గ్రామ వ్యవస్థ ఆర్థికంగా బాగుపడుతుంది అని సూచించారు. దేశంలో అనేకమంది వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నా అనుకున్న విధంగా సాగులో మార్పులు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో దాదాపు 10 కోట్ల మంది రైతులు ఉన్నారు.. ప్రభుత్వం కల్పించే సంక్షేమ ఫలాలు రైతులకు సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యతను మరవద్దు అని రైతులు ప్రభుత్వ విద్యుత్ సబ్సిడీలపై ఆధారపడకుండా సోలార్ ఎనర్జీ పై రైతులకు అవగాహన కల్పించాలి అని అధికారులకు సూచించారు. భారతదేశ రైతులు సాగులో ప్రపంచంలోనే శ్రేష్టమైన రైతులుగా ఎదిగేందుకు కెవికే, ఐకార్ లు కృషి చేయాలి అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ స్వదేశీ నినాద స్ఫూర్తితో ప్రధాని మోదీ ఫోకల్ ఫర్ లోకల్ పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. 1989 లో విదేశీ మారక ద్రవ్య నిలవల్తో పొలుచుకుంటే ఇప్పుడు భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వ 700 రేట్లు పెరిగింది అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు తరచూ రైతులతో చర్చించి, వారి సమస్యలకు పరిష్కారం చూపాలి అన్నారు.ప్రతి భారతీయుడు జాతీయ వాదంపై విశ్వాసం ఉంచాలి అన్నారు.

సేంద్రియ సాగు పై రైతులకు అవగాహన కల్పించడంలో కేవీకే,ఏకలవ్య ఫౌండేషన్ సేవలు మరువలేం: జిష్ణు దేవ్ వర్మ, తెలంగాణ గవర్నర్

జిల్లాలో సేంద్రియ సాగు పై రైతులకు అవగాహన కల్పించడంలో తునికి కృషి విజ్ఞాన కేంద్రం ఏకలవ్య ఫౌండేషన్ సేవలు మరువలేనివని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ అన్నారు. ఉపరాష్ట్రపతి తో కలిసి గవర్నర్ తునికి కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన రైతు ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొని మాట్లాడారు. ఆర్గానిక్ సాగు చేస్తున్న 800 మంది రైతులు ఈ సమ్మేళనం లో పాల్గొనడం ఆనందంగా ఉంది అన్నారు. దేశంలో రైతులు మళ్ళీ ఆర్గానిక్ సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. రసాయనిక సాగును క్రమక్రమంగా తగ్గిస్తున్నారు. ఏకలవ్య ఫౌండేషన్, కేవికె సంస్థ ఆర్గానిక్ సాగు దిశలో రైతులకు మేలైన సహకారం అందిస్తున్నదడం పట్ల అభినందించారు. రాబోయే రోజుల్లో మరింతగా ఆర్గానిక్ సాగు విస్తృతికి కృషి అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి, ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్ సివి రావు,తెలంగాణ రాష్ట్ర ఆర్ఎస్ఎస్ చీఫ్ బాలయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed