- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India Cements: ఇండియా సిమెంట్స్ సీఈఓ, ఎండీ పదవికి ఎన్ శ్రీనివాసన్ రాజీనామా
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ సిమెంట్ తయారీ కంపెనీ ఇండియా సిమెంట్స్ సీఈఓ, ఎండీ పదవులకు ఎన్ శ్రీనివాసన్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కంపెనీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే ఇండియా సిమెంట్స్‌ను అల్ట్రాటెక్ సిమెంట్ కొనుగోలు చేయడాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదించిన నేపథ్యంలో ఈ పరిణామం పరిశ్రమలో చర్చనీయాంశం. ఈ ఏడాది జూలైలో దేశీయ అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీ ఆల్ట్రాటెక్ సిమెంట్ అధినేత బిర్లా ఎన్ శ్రీనివాసన్, అతని కుటుంబానికి చెందిన ఇండియా సిమెంట్స్ వ్యాపారాన్ని రూ. 3,954 కోట్లకు కొనుగోలు చేశారు. తద్వారా 32.7 శాతం వాటాను ఆల్ట్రాటెక్ సిమెంట్ సొంతమైందని ఇండియా సిమెంట్స్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. తద్వారా కంపెనీ మొత్తం వాటా 55.5 శాతానికి చేరింది. ఇండియా సిమెంట్స్ గడించిన కొన్ని త్రైమాసికాల నుంచి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. దక్షిణాదిలోని అతిపెద్ద సిమెంట్ తయారీ కంపెనీల్లో ఒకటైన ఇండియా సిమెంట్స్ చరిత్రలో అనేక రికార్డులను సాధించింది. 75 ఏళ్ల కంటే ఎక్కువ కాలం సిమెంట్ పరిశ్రమలో కొనసాగుతున్న ఈ కంపెనీ పంబన్ వంతెన, ఐఐటీ మద్రాస్, కన్యాకుమారిలోని స్వామి వివేకానంద రాక్ మెమోరియల్‌తో సహా అనేక మైలురాయి ప్రాజెక్టులలో భాగస్వామ్యం కలిగి ఉంది.