R Krishnaiah: మొదటి నుంచి నేను ఆర్ఎస్ఎస్ వాదినే.. ఆర్ కృష్ణయ్య సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-12-25 14:16:48.0  )
R Krishnaiah: మొదటి నుంచి నేను ఆర్ఎస్ఎస్ వాదినే.. ఆర్ కృష్ణయ్య సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: మొదటి నుంచి తాను ఆర్ఎస్ఎస్ (RSS) వాదినేనని రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య (R Krishnaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల విద్య నుంచే తనపై వివేకానందుడి (Vivekananda) బోధనల ప్రభావం పడిందని అన్నారు. ఇక అక్కడి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ (Rashtriya Swayam Sevak Sangh)కు పని చేయాలనే అభిలాష పెరిగిందని తెలిపారు. జీవితం అంటే బ్రతకడం కాదని.. సమాజానికి మేలు చేయాలనే తపన ఆర్ఎస్ఎస్ (RSS) మూలంగానే తనలో కలిగిందని అన్నారు. సమాజ సేవే లక్ష్యంగా పని చేస్తున్న ఆర్ఎస్ఎస్‌ (RSS)ను నేడు సమాజం తప్పుగా అర్థం చేసుకోవడం చాలా బాధకరమని అన్నారు.

విద్యార్థి దశలోనే తాను లీడర్ అయ్యానని ఎస్సీ (SC), ఎస్టీ (ST), బీసీ (BC) విద్యార్థులు చదువుకోవాలని హాస్టళ్లు (Hostels), గురుకులాలు పెట్టించానని అన్నారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ (Reimbursement of Fees) బకాయిలను ఎప్పటికప్పుడు ప్రభుత్వాలతో మాట్లాడి విడుదల చేయించానని గుర్తు చేశారు. పొలిటికల్‌గా బీసీలను బలోపేతం చేసేందుకు తాను నిత్యం కృషి చేస్తూనే ఉన్నానని అన్నారు. రాజకీయాల్లో నేడు నిస్వార్థ సేవ, పోరాటాలకు మూలం కూడా ఆ భావజాలమే కారణమని అన్నారు. ఏనాడు తాను పైసా అవినీతికి పాల్పడలేదని తెలిపారు. తనను ఎవరూ రాజకీయ నాయకుడిగా చూడరని.. అందుకే అన్ని పార్టీల వాళ్లు తనకు పదవులు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. అదేవిధంగా వైసీపీ (YCP)ఇచ్చిన రాజ్యసభ సీటును వదులుకోవడం బాధగానే ఉందని.. కానీ తప్పలేదన్నారు. బీజేపీ (BJP) రాజ్యసభ సీటు ఇవ్వడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదని ఆర్ కృష్ణయ్య అన్నారు.

Advertisement

Next Story

Most Viewed