అకాల వ‌ర్షం..రైత‌న్న ఆగం..

by Aamani |
అకాల వ‌ర్షం..రైత‌న్న ఆగం..
X

దిశ‌,ఏటూరునాగారం : అకాల వ‌ర్షం తో రైత‌న్న‌లు ఆగం ఆగం అవుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేస్తార‌ని నిలువ ఉంచిన ధాన్యం కొనుగోలు చేయ‌డం అల‌స్యం అవ‌డంతో రైతన్న‌లు న‌ష్ట‌పోతున్నారు. అరుగాలం క‌ష్ట ప‌డి పంట‌ను పండించాడానికి ఏంత క‌ష్టం ప‌డుతున్నామో అదే ధాన్యంని కొనుగోలు కేంద్రానికి త‌ర‌లించాక కొనుగోలు కేంద్రాల నిర్వ‌హకులు కొనుగోలు చేయ‌డంలో అల‌స‌త్వం వ‌హించ‌డంతో అ ధాన్యాన్ని కాపాడడానికి అంతే శ్రమించాల్సి వ‌స్తుంద‌ని రైత‌న్న‌లు అవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వందెకరాల ధాన్యం కొనుగోలుకు నోచుకోక తడిసి ముద్దయ్యాయి.

ఏటూరునాగారం, చిన్నబోయినపల్లి, ఆకుల వారి గణపురం, ఎక్కెల, శంకరాజుపల్లి, రామన్నగూడెం, రాంనగర్, లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు దాన్యాన్ని తీసుకువచ్చి 15 రోజులు గడుస్తున్న కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొనుగోలు చేయడంలో అలసత్వం వహించడంతో కురిసిన అకాల వర్షానికి దాన్యం బస్తాలు త‌డిసి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. పంటను పండించడంలో ఓ కష్టమైతే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చాక ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు ఆలస్యం కావడంతో వాటిని కాపాడుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని త్వరగా కొనుగోలు చేసి ఆదుకోవాలని ఏజెన్సీ ప్రాంత రైతులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed