Ola Electric: 500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఓలా ఎలక్ట్రిక్

by S Gopi |
Ola Electric: 500 మంది ఉద్యోగులను తొలగించనున్న ఓలా ఎలక్ట్రిక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎలక్ట్రిక్ టూ-వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరోసారి లేఆఫ్ ప్రక్రియను చేపట్టనుంది. లాభాల మార్జిన్‌, లాభదాయకతను మెరుగుపరచడం కోసం పునర్నిర్మాణంలో భాగంగా దాదాపు 500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా కార్యకలాపాల సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు చర్యలు అవసరమని కంపెనీ భావిస్తున్నట్టు జాతీయ మీడియా మింట్ కథనం పేర్కొంది. దీనికి సంబంధించి ఓలా అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఓలా ఎలక్ట్రిక్ సంస్థాగత మార్పులను చేపట్టడం ఇది మొదటిసారి కాదు. మారుతున్న వ్యాపార ప్రాధాన్యతలకు అనుగుణంగా కంపెనీ గతంలోనూ ఇదే తరహా లేఆఫ్ ప్రక్రియను నిర్వహించింది. తన కోర్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) వ్యాపారంపై దృష్టి సారించడానికి కార్లు, క్లౌడ్ కిచెన్, కిరాణా డెలివరీని వంటి మూడు వ్యాపారాలను మూసివేసింది. దానివల్ల దాదాపు 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఏడాది మార్చిలోనూ ఇదే తరహా తొలగింపులను చేపట్టింది. కాగా, గత కొంతకాలంగా ఓలా ఎలక్ట్రిక్ సర్వీస్ లోపాలు, వాహనాల నాణ్యతపై ఆందోళనలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దర్యాప్తు నిర్వహిస్తోంది.

Advertisement

Next Story