108 అంబులెన్స్ లో డెలివరీ… తల్లి, బిడ్డ క్షేమం

by Kalyani |
108 అంబులెన్స్ లో డెలివరీ… తల్లి, బిడ్డ క్షేమం
X

దిశ, కేసముద్రం: కేసముద్రం మండలం కల్వల గ్రామ శివారు వనాల కుంట తండాకు చెందిన ధరావత్ కవితకు పురిటి నొప్పులు అధికం కావడంతో 108కి సమాచారం ఇచ్చారు. సమీపంలో ఉన్న కేసముద్రం అంబులెన్స్ వేరొక అత్యవసర కేసులో ఉన్నందున తొర్రూర్ 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా హుటాహుటిన బాధితురాలు దగ్గరికి చేరుకుంది. వెంటనే మహబూబాబాద్ ప్రాంతీయ దవాఖానకు తరలించే క్రమంలో మార్గ మధ్యలో నొప్పులు అధికం కావడంతో వెహికల్ పక్కకు ఆపి అంబులెన్స్ సిబ్బంది డెలివరీ చేశారు. 108 సిబ్బంది ఈఎంటి రఘు చుక్కల, పైలట్ గంజి నవీన్ ల పట్ల కవిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు.


Advertisement

Next Story