మన్మోహన్‌ సింగ్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు

by Jakkula Mamatha |   ( Updated:2024-12-27 10:38:45.0  )
మన్మోహన్‌ సింగ్‌ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం చంద్రబాబు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఢిల్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former PM Manmohan Singh) పార్థివదేహానికి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, డాక్టర్ బైరెడ్డి శబరి కూడా మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దేశానికి మన్మోహన్ సింగ్ అవిశ్రాంతంగా సేవలందించారని, ఆయన మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. మన్మోహన్ తన సుదీర్ఘ ప్రస్థానంలో అనేక ఉన్నత పదవులు చేపట్టారని, ఆయా పదవులను సమర్థవంతంగా నిర్వర్తించారని కీర్తించారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు. ఉపాధి హామీ, ఆధార్, ఆర్టీఐ, విద్యా హక్కు చట్టం తీసుకువచ్చారని వెల్లడించారు.

Advertisement

Next Story