- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TG Govt.: ఫుడ్ పాయిజన్ ఘటనలపై సర్కార్ నజర్.. ‘గులాబీ’ కాంట్రాక్టర్లకు చెక్!
దిశ, తెలంగాణ బ్యూరో: గురుకులాల్లో చోటుచేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. కాంట్రాక్టర్ల కారణంగానే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే ఫిర్యాదులు సర్కారుకు వస్తున్నట్టు సమాచారం. దీనికి తోడు నాణ్యత లేని ఆహారాన్ని విద్యార్థులకు అందిస్తున్నట్టు అధికారుల తనిఖీల్లో వెల్లడైనట్టు తెలిసింది. అలాంటి కాంట్రాక్టర్లను తొలగించి కొత్త వారికి బాధ్యతలు అప్పగించేందుకు సర్కారు సిద్ధమైనట్టు సమాచారం. త్వరలో టెండర్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని వారికి మెస్ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతున్నది.
గతంలో బీఆర్ఎస్ అనుచరులకు మెస్ బాధ్యతలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మెస్ కాంట్రాక్టు పనులను గత ప్రభుత్వం మెజార్టీగా బీఆర్ఎస్ లీడర్లు, బినామీలకే అప్పగించినట్టు విమర్శలు ఉన్నాయి. వంట పనులు చేసే వారు, రేషన్, కూరగాయలు సరఫరా.. ఇలా చాలా వాటిల్లో గులాబీ అనుచరులే ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్న సదరు కాంట్రాక్టర్లు.. ప్రస్తుత ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు టాక్. అందులో భాగంగానే విద్యార్థులకు సరైన ఆహారం అందించడం లేదని, ఫలితంగా పిల్లలు తరుచుగా అనారోగ్యానికి గురవుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిసింది. ఇటీవల హస్టల్స్‌లో అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేయడంతో కాంట్రాక్టర్ల లోపాలు బహిర్గతం అయినట్టు తెలుస్తున్నది. వంట సరిగా చేయకపోవడం, నాసిరకం సరుకులు, పుచ్చులు ఉన్న కూరగాయాలు సరఫరా చేస్తున్నట్టు ఆధారాలు లభ్యమయ్యాయని టాక్.
కొత్త వారికి బాధ్యతలు!
ప్రస్తుతం హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో పెంచింది. దానితో పిల్లలకు కావాల్సిన పౌష్టికాహారం అందించవచ్చని భావిస్తున్నది. మరోవైపు ప్రస్తుతం వంట పనులు, కూరగాయాలు, సరుకులు చేస్తున్న ఎజెన్సీలకు సైతం అధికారులు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అకడమిక్ ఇయర్ ముగిసే లోపు మెస్‌పై ఏ చిన్న ఫిర్యాదు వచ్చినా సదరు ఎజెన్సీని బ్లాక్ లిస్టులో పెడుతామని హెచ్చరించినట్టు సమాచారం. వచ్చే అకడమిక్ ఇయర్‌లో కొత్తగా టెండర్లు పిలిచి, ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని ఎజెన్సీలకు బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నది.