- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HCA President: వరల్డ్‌కప్ తర్వాత నగదు బహుమతి ప్రకటిస్తాం
దిశ, తెలంగాణ బ్యూరో: ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్‌కప్‌కు ఎంపికైన తెలంగాణ క్రికెటర్లు త్రిష, ధ్రుతిని స్ఫూర్తిగా తీసుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్ మోహన్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో శనివారం త్రిష, ధృతిని జగన్‌మోహన్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రావు మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ వంటి మెగా టోర్నమెంట్‌కు ఇద్దరు తెలంగాణ క్రికెటర్లు ఎంపికవడం గర్వంగా ఉందన్నారు. వీరు ఈ స్థాయికి చేరుకోవడానికి వారి తల్లిదండ్రులు, కోచ్‌లు పడిన శ్రమ మాట్లాల్లో చెప్పలేనిదని తెలిపారు.
వర్ధమాన క్రికెటర్లు వీరిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. జాతీయ జట్టులో, డబ్ల్యూపీఎల్(మహిళల ప్రీమియర్ లీగ్)లో మరింత మంది తెలంగాణ క్రికెటర్లు ప్రాతినిథ్యం వహించేలా తమ కార్యవర్గం కృషి చేస్తోందని చెప్పారు. వరల్డ్‌కప్‌లో ఆడి వచ్చాక ఈ ఇరువురు ప్లేయర్లకు నగదు బహుమతి ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్, సహాయ కార్యదర్శి బసవరాజు, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్, ఐసీఏ సభ్యురాలు వంకా రోమ తదితరులు పాల్గొన్నారు.