CA Final Results: సీఏ తుది ఫలితాలు విడుదల.. తెలుగు వారిదే ఫస్ట్ ర్యాంక్..!

by Maddikunta Saikiran |
CA Final Results: సీఏ తుది ఫలితాలు విడుదల.. తెలుగు వారిదే ఫస్ట్ ర్యాంక్..!
X

దిశ, వెబ్‌డెస్క్: చార్టడ్ అకౌంటెంట్ ఫైనల్ నవంబర్-2024(CA Final) పరీక్ష తుది ఫలితాలు(Final Results) రిలీజ్ అయ్యాయి. ఈ మేరకు ఇన్సిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) అధికారిక ప్రకటన జారీ చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://icai.nic.in/caresult/ ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్(Registration No), రోల్ నంబర్(Roll No), క్యాప్చ(Captcha) ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. హైదరాబాద్‌కు చెందిన హేరంబ్ మహేశ్వరి, తిరుపతికి చెందిన రిషబ్ 508 మార్కులతో సంయుక్తంగా ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 501 మార్కులతో రియా కుంజన్‌కుమార్ షా సెకండ్ ర్యాంక్, 493 మార్కులతో కింజల్ అజ్మీరా మూడో ర్యాంక్ సాధించారు. కాగా ఈ ఏడాది నవంబర్ 3, 5, 7 తేదీల్లో సీఏ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed