NIA raids: జమ్మూ కశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాదుల చొరబాట్ల కేసులో చర్యలు

by vinod kumar |
NIA raids: జమ్మూ కశ్మీర్‌లో ఎన్ఐఏ సోదాలు.. ఉగ్రవాదుల చొరబాట్ల కేసులో చర్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోదాలు చేపట్టింది. ఉగ్రవాదుల చొరబాటు, భద్రతా బలగాలు, పౌరులపై ఇటీవల జరిగిన దాడులకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఐదు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గురువారం తనిఖీలు చేపట్టింది. రియాసి, ఉధంపూర్, దోడా, రాంబన్ మరియు కిష్త్వార్ జిల్లాల్లోని ఎనిమిది ప్రదేశాలలో దాడులు నిర్వహించినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద సానుభూతి పరులు, నిషేధిత సంస్థల కార్యకలాపాలపైనా ఆరా తీసినట్టు వెల్లడించాయి. పలు ఉగ్ర సంస్థలు ఇటీవల కొత్త శాఖలు ఏర్పాటు చేశాయనే సమాచారంతో తనిఖీలు చేసినట్టు తెలిపాయి. ఈ క్రమంలో పలు నిషేధిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు రేఖ, నియంత్రణ రేఖ వెంబడి లష్కరే తోయిబా (LET), జైషే మహ్మద్ (JM)లకు చెందిన ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడ్డారనే సమాచారం ఆధారంగా అక్టోబర్ 24న ఎన్‌ఐఏ కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే సోదాలు జరిగాయి. నార్కో-టెర్రర్ నెట్‌వర్క్‌(Narco terrar net work)ను నిర్వీర్యం చేయడం, కశ్మీర్‌లో ఉగ్రవాద నిధుల మూలాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed