Konda Surekha : మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ

by Y. Venkata Narasimha Reddy |
Konda Surekha : మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : నిన్నటిదాక నాగచైతన్య, సమంతల విడాకులపై వివాస్పద కామెంట్లు చేసి న్యాయ వివాదంలో చిక్కుకున్న మంత్రి కొండా సురేఖ(Konda Surekha)మరోసారి ఇంట్లో శుభకార్యం సందర్భంగా నిర్వహించిన విందు(Party)లో చేసిన వ్యాఖ్యలతో మళ్ళీ వివాదంలో పడ్డారు. కుటుంబ సభ్యులతో ఇన్‌స్టా లైవ్‌లో మంత్రి సురేఖ మాట్లాడుతూ బిర్యానీ ఉన్నప్పుడు బీర్ ఉంటుందని, ఎక్కువ డ్యాన్స్ చేస్తే వారికి మందు అంటూ వ్యాఖ్యానించారు. అఫిషియల్, అనఫిషియల్ సెలబ్రేషన్స్ బట్టి మందు పెట్టడం పెట్టకపోవడం ఉంటుందన్నారు. చిన్న పాపను ఎత్తుకున్న సురేఖ ఒకవైపు బిర్యానీ అయితుంది, ఇంకోవైపు సల్లబడటం ఆయితుందని, మనం కూడా తాగుడు నేర్చుకుంటే అయిపోవంటూ కూడా వ్యాఖ్యానించారు.

ఆమె వ్యాఖ్యలను చూస్తే పార్టీలో పురుషుల కోసం మద్యం ఏర్పాటు చేసినట్లుగా భావిస్తున్నారు. అదే వీడియోలో వరంగల్‌లో కొండా మురళి.. ఇక్కడ హైదరాబాద్ లో సురేఖ మందు పారిస్తున్నారన్న వ్యాఖ్యలు కూడా అవతలి వ్యక్తి మాట్లాడటం..బదులుగా బీరు, బిర్యానీ తెప్పిస్తున్నానంటు సురేఖ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలను మంత్రి సురేఖ రాజకీయ ప్రత్యర్థులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటంతో ఆమె మరో వివాదంలో చిక్కుకున్నట్లయ్యింది.

Advertisement

Next Story

Most Viewed