Nayana vs Dhanush : నయన్ వర్సెస్ ధనుష్..పెండ్లి వేడుకలోనూ అదే తీరు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-21 17:40:35.0  )
Nayana vs Dhanush : నయన్ వర్సెస్ ధనుష్..పెండ్లి వేడుకలోనూ అదే తీరు
X

దిశ, వెబ్ డెస్క్ : లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara)డాక్యుమెంటరీలో వాడిన 3 సెకన్ల క్లిప్పింగ్‌ విషయమై హీరో ధనుష్(Dhanush)తో నెలకొన్న వివాదం కొనసాగుతుండగానే వారిద్ధరూ ఒకే వేదికపై ప్రత్యక్షమై అందర్నీ ఆశ్చర్యపరిచారు. చెన్నై వేదికగా జరిగిన ఒక వివాహ వేడుకకి ఇద్దరూ హాజరయ్యారు. టౌన్ పిక్చర్స్ వ్యవస్థాపకుడు ఆకాష్ భాస్కర్ ఈ రోజు వివాహం చేసుకున్నారు. ఆకాష్ భాస్కర్ వివాహానికి తొలుత ధనుష్ హాజరవ్వగా.. ఆ తర్వాత నయనతార కూడా తన భర్త విఘ్నేశ్ శివన్‌తో వచ్చింది. సినీ సెలెబ్రిటీలందరికీ వివాహ మండపంలో ముందు వరుస కుర్చీలను కేటాయించారు. దాంతో ధనుష్, నయనతార ఒకే వరుసలో పక్క పక్కనే కూర్చోవాల్సి వచ్చింది. అయినప్పటికీ.. ఇద్దరూ కనీసం ఒకరి వైపు మరొకరు చూసుకోలేదు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల నయనతార తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌‌లోని ఆసక్తికరమైన విషయాల్ని‘నయనతార : బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ అనే డాక్యుమెంటరీ రూపంలో అభిమానులకి ముందుకు తీసుకొచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ అవుతుండగా.. అందులో ‘నేనూ రౌడీనే’ అనే ధనుష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమా నుంచి 3 సెకన్ల క్లిప్పింగ్‌ను వాడారు. అయితే తన అనుమతి లేకుండా ఆ సీన్లను వాడారని ఆగ్రహించిన ధనుష్.. రూ.10 కోట్లు పరిహారం చెల్లించాలంటూ నయనతారకి నోటీసులు పంపాడు. ఆ నోటీసులపై స్పందించిన నయనతార 3 సెకన్లకి రూ.10 కోట్లు ఏంటి? అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఈ వివాదంలో అటు ఇండస్ట్రీ, ఇటు ఇరువర్గాల అభిమానులు తమ అభిమాన హీరో హీరోయిన్లకు మద్ధతుగా చీలిపోయారు.

Advertisement

Next Story

Most Viewed