యోగివేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజీనామా

by M.Rajitha |
యోగివేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజీనామా
X

దిశ, వెబ్ డెస్క్ : కడప యోగివేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేశారు. రాంప్రసాద్ రెడ్డి పదిరోజుల క్రితమే రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను రిజిస్ట్రార్ నియమించడాన్ని పలు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వానికి కూడా ఆయనను బాధ్యతల నుండి తప్పించాలని విద్యార్థి సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాంప్రసాద్ రెడ్డి సోమవారం సాయంత్రం తాను బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టు తెలిపారు. తన రాజీనామాను వైస్ ఛాన్సలర్ కృష్ణారెడ్డికి సమర్పించగా.. వెంటనే రాజీనామాను ఆమోదించారు.

Advertisement

Next Story