- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
LIC: అదానీపై కేసుతో ఎల్ఐసీకి రూ. 8,500 కోట్ల నష్టం
దిశ, బిజినెస్ బ్యూరో: బిలీయనీర్ గౌతమ్ అదానీతో పాటు మరో ఏడుగురిపై అమెరికా ఎఫ్‌బీఐ ఆరోపణలు చేసింది. దీనివల్ల అదానీ గ్రూప్ కంపెనీల షేర్లలో పెద్ద ఎత్తున నష్టాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే దేశీయ అతిపెద్ద బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) గురువారం రూ. 8,566 కోట్ల నష్టాలను ఎదుర్కొంది. ఎల్ఐసీకి ఏడు అదానీ గ్రూప్ కంపెనీల్లో వాటాలు ఉన్నాయి. కార్పొరేట్ డేటాబేస్ ఏస్ ఈక్విటీ నుంచి సేకరించిన డేటా ప్రకారం.. ఈ వారం ప్రారంభంలో అదానీ స్టాక్స్‌లో ఎల్ఐసీకి రూ. 54,861 కోట్ల విలువైన హోల్డింగ్స్ ఉన్నాయి. గురువారం నాటికి ఇది రూ. 46,294 కోట్లుగా ఉన్నాయి. ఏసీసీ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ అంబుజా సిమెంట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్ ఎనర్జీలో ఎల్ఐసీకి 1.36 శాతం నుంచి 7.86 శాతం వాటాలను కలిగి ఉంది. గురువారం ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ కంపెనీలు 8 శాతం నుంచి 24 శాతం మేర పతనమయ్యాయి.