- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Aurobindo Pharma: గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్న అరబిందో ఫార్మా..!
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(HYD) కేంద్రంగా ఫార్మా సర్వీసులు అందిస్తున్న ప్రముఖ సంస్థ అరబిందో ఫార్మా(Aurobindo Pharma) శ్వాసకోశ సంబంధిత ఔషధాల అభివృద్ధికి, విక్రయానికై గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ(Global pharmaceutical company)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని కంపెనీ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఆ అంతర్జాతీయ ఫార్మా సంస్థ పేరు మాత్రం కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కాగా ఈ ఒప్పందంలో భాగంగా శ్వాస సంబంధిత ఉత్పత్తుల అభివృద్ధి, కమర్షియలైజేషన్‌ను చేపట్టనున్నట్లు అరబిందో ఫార్మా పేర్కొంది. ఈ ఒప్పంద కాలపరిమితి 3–5 సంవత్సరాల వరకు ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది. అలాగే అభివృద్ధి చేసిన ఔషధాలను భాగస్వామ్య సంస్థకు చెందిన ప్లాంట్(Plant)లో ఉత్పత్తి చేయడంతో పాటు ఇరు కంపెనీలు సంయుక్తంగా మార్కెటింగ్(Marketing) చేపడుతాయని అరబిందో ఫార్మా పేర్కొంది. కాగా ఈ ఔషధ అభివృద్ధి కాలంలో అరబిందో గరిష్టంగా 90 మిలియన్ల డాలర్ల మేర ఖర్చు చేయనుంది.