హైదరాబాద్‌కు ఏపీ సీఎం.. షెడ్యూల్ ఇదే..!

by srinivas |   ( Updated:2025-01-03 03:17:19.0  )
హైదరాబాద్‌కు ఏపీ సీఎం.. షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌(Hyderabad)కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu Naidu) రానున్నారు. ఇవాళ నగరంలో జరిగే ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహా సభల్లో(World Telugu Federation 12th Biennial International Conference) ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 5వ తేదీ వరకూ జరగబోయే ఈ సభలు నేడు ప్రారంభంకానున్నాయి. హెచ్ఐసీసీ నోవాటెల్‌(HICC Novatel)లో జరిగే ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు(Former Vice President Venkaiah Naidu), కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) సహా తదితర ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. ఈ నెల 5వ తేదీని జరిగే ముగింపు కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) కూడా ఈ సభలకు హాజరుకానున్నారు. చిత్ర పరిశ్రమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయసుధ, మురళీమోహన్‌తో పాటు విదేశీల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా ఈ సభల్లో పాల్గొనున్నారు.

ఇక తెలుగుదనం ఉట్టిపడేలా ఈ సభలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కూచిపూడి నృత్యం, జానపద పదర్శనలు, సినీ సంగీతం, తెలుగు చేనేత వస్త్ర ప్రదర్శనలతో పాటు సాహితీ రూపకాలు, భాష, సంస్కృతులపై పలువురు ప్రముఖులు ప్రసంగం వంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed