- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైతు గడ్డివాము దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం..
దిశ ,బయ్యారం: మండల కేంద్రంలో గురువారం అర్థ రాత్రి పశువుల మేత ,ఎండు వరిగడ్డి వాము దగ్ధమైంది. సుమారుగా 6 ఎకరాల గడ్డివాము గురువారం రాత్రి గుర్తు లేని వ్యక్తులు లైటర్ తో తగలబెట్టినట్లు సమాచారం.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తమ పశువులకు ఆరు ఎకరాల గడ్డిని కొనుగోలు చేసి వారి ఇంటి సమీపంలో గడ్డివాముగా పెట్టుకున్నట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు కొంతమంది లైటర్ సహాయంతో గడ్డిని దగ్ధం చేసినట్లు ఆరోపిస్తున్నారు. గడ్డి తగలబెట్టిన సమీపంలో లైటర్ ఉండటం విశేషం. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ స్టేషన్ కి స్థానికులు సమాచారం అందించారు.
మహబూబాబాద్ నుండి ఫైర్ సిబ్బంది గురువారం రాత్రి సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని రాత్రి నుండి శుక్రవారం ఉదయం వరకుశ్రమించి మంటలను అదుపులోకి తీసుకోవచ్చారు.దీంతో రైతుకురూ. 60 వేల నుంచి 80 వేల ఆర్థిక నష్టం జరిగినట్లు ప్రాథమికంగా తెలిపారు. పశువుల మేతకు సమీకరించి న వారి గడ్డి దగ్ధం చేయడంపై పలువురు స్తానికులు మండి పడ్డారు.ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వారిని గుర్తించి చట్టపరంగా శిక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ అగ్నిమాపక ఫైర్ ఆఫీసర్ నాగేశ్వరరావు నిరోధక సిబ్బంది ,మహేష్, రమేష్ ,వెంకన్న, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.