వర్జిన్ అమ్మాయి భార్యగా.. అలా అస్సలు చేయొద్దంటూ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన చిన్మయి(పోస్ట్)

by Kavitha |
వర్జిన్ అమ్మాయి భార్యగా.. అలా అస్సలు చేయొద్దంటూ నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన చిన్మయి(పోస్ట్)
X

దిశ, సినిమా: స్టార్ సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను పాడి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అలాగే స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెప్పి ఇంకా పాపులారిటీ పెంచుకుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ సమాజంలో జరుగుతున్న పలు విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ అనేక సార్లు వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో ఈ భామ మరోసారి ఓ విషయంపై తనదైన రీతిలో స్పందించింది.

తాజాగా బ్లింకిట్ డెలివరీ యాప్ సీఈఓ డిసెంబర్ 31 వ తేదీన జరిగిన ఫుడ్‌ , పలు వస్తువుల డెలివరీల గురించి తన సోషల్ మీడియా అకౌంట్‌లో రాసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన కేవలం ఆ ఒక్క రోజే 1,20,000 కాండోమ్స్ అమ్ముడుపోయినట్లు తెలియజేశాడు. దీనికి ఒక నెటిజన్ స్పందిస్తూ.. డిసెంబర్ 31న రాత్రి ఒక లక్ష ఇరవై వేల కండోమ్ ప్యాకెట్లు డెలివరీ అయినట్లు బ్లింకిట్ సీఈవో పోస్ట్ చేశారు.

కేవలం ఒక్క రాత్రి అది కూడా బ్లింకిట్‌లో మాత్రమే ఆ స్థాయిలో జరిగితే ఇతర ఆప్‌లలో కలుపుకుంటే ఆ విక్రయాలు కోటి వరకు ఉంటాయి అని స్పందించాడు. అలాగే ఈ తరంలో పెళ్లి చేసుకోవడానికి వర్జిన్ అమ్మాయి దొరకడం అదృష్టం అని కూడా పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌కి చిన్మయి తనదైన రీతిలో స్పందిస్తూ.. ‘అలాంటప్పుడు మగవారు పెళ్లికి ముందు అమ్మాయిలతో సెక్స్ అస్సలు చేయొద్దు’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed