- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పటికీ ఈయన నాకు ప్రొఫెసరే: పవన్ కల్యాణ్

దిశ, వెబ్ డెస్క్: 2006లో పుస్తకాల మధ్య సినిమాలు చేశానని, అందుకే అవి నచ్చకపోయి ఉండొచ్చని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్బంగా తన జీవితంలో జరిగిన ఓ సందర్భాన్ని గుర్తు చేశారు.
‘‘2006లో నేను విపరీతంగా ఒక పీహెచ్ డీ కోసం ఒక స్కాలర్ ఎలా చదువుతాడో పుస్తకాల మధ్యలో సినిమాలు చేశా. ఆ సమయంలో నా సినిమాలు ప్రజలకు నచ్చి ఉండకపోవచ్చు. కానీ నా జ్వలనాన్ని మాత్రం ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ గుర్తించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి తనను కలిసేందుకు నెల రోజులు ప్రయత్నం చేశారు. నెల తర్వాత ఆయనను తాను కలిశా. తమరు రాజకీయాల్లోకి వస్తారా? అని నన్ను ఆయన ఒకే ఒక మాట అడిగారు. బహుజన సిద్దాంతాన్ని ముందుకు తీసుకెళ్తాం అని చెప్పారు. చాలా మంది నన్ను అడిగి మీ దగ్గరకు పంపారు. మీరు సంసిద్ధంటే మేము ముందుకు వెళ్తాం అని తెలిపారు. ఆ రోజున నాకు మెచ్యూరిటీ లేదు. ఒక కుటుంబాన్ని నడపడానికే చాలా శ్రమ పడాలి. కొన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాలను ఒక భావంతో కట్టిపడేయాలంటే సమయం కావాలని ఆయనకు చెప్పా.’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ వ్యక్తిని తాను అరుదుగా అప్పుడప్పుడూ కలుస్తా ఉంటానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆయనే ప్రొఫెసర్ శ్రీపతి రాముడు అని ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పని చేస్తున్నారు. సినిమాల్లో ప్రజలకు పని చేసే మనిషిని నాలో చూశారు. అలాంటి మేధావి శ్రీపతి రాముడు. నాకు ఎప్పుడూ కూడా ఆయన ప్రొఫెసరే. బహుజన సిద్ధాంతాలు, అణగారిన వర్గాల కోసం నిలబడిన వ్యక్తి. చాలా మంది విద్యార్థులను పీహెచ్‌డీలకు సిద్ధం చేసే వ్యక్తి. నేను ఓడిపోయినా వెంట నిలబడ్డారు. నేను ఆయనకు ప్రేమను మాత్రమే ఇవ్వగలను.’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.
READ MORE ...
ఆ సినిమా వల్లే గద్దరన్న పరిచయం అయ్యారు : పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు