- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులు వరి కోతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి : కలెక్టర్
దిశ,గీసుగొండ: రైతులు తమ వరి పంటను కోసే సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. మండల కేంద్రంలోని గీసుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రంలోని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సత్య శారద, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక రైతు పాకనాటి సురేష్ వ్యవసాయ క్షేత్రంలో కమాండ్ హార్వెస్టర్ తో కోస్తున్న వరి పంటను కలెక్టర్ పరిశీలించారు. హార్వెస్టర్ ద్వారా రైతులు వరి కోతలు కోస్తున్నందున హార్వెస్టర్ బ్లోయర్ స్పీడ్ 18-20 ఆర్ పి యం ఉండే విధంగా వాటి యజమానులు చూసుకుంటే నాణ్యమైన వడ్లు వస్తాయని కలెక్టర్ తెలిపారు. రైతులు తమ వడ్లను కొనుగోలు కేంద్రాలకు ఒకేసారి కాకుండా క్రమ పద్ధతి పాటించాలని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ప్యాడి క్లీనర్లతో శుభ్రపరిచిన ధాన్యాన్ని సేకరిస్తే రైతులకు మంచి ధర వస్తుందన్నారు.
రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించే విధంగా రైతులు ఏఈఓ లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అనంతరం పత్తి తీస్తున్న రైతులతో కలెక్టర్ వ్యవసాయ అధికారి మాట్లాడుతూ.పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 ఉన్న పత్తిని లూస్ గా మార్కెట్ కు తరలించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. రైతులు కూరగాయల తోటలు పండిస్తే తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందవచ్చని దగ్గరలోనే వరంగల్ నగరం ఉన్నందున డిమాండ్ ను బట్టి కూరగాయలు సాగు చేసి రైతులు అధిక లాభాలు పొందాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి హరి ప్రసాద్ బాబు ఏఈఓ ఎం.కావ్య, గీసుగొండ సహకార సంఘం సీఈఓ కే.ప్రదీప్, సహకార సంఘం డైరెక్టర్ వజ్ర రాజు,రైతులు పీసాల రాజేశ్వర రావు,నూతన్,శిరీసే రాజు తదితరులు పాల్గొన్నారు.