- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఈడీ అభ్యర్థుల ‘చలో ఇందిరాపార్క్’
by Mahesh |
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో బీఈడీ అభ్యర్థులతో భర్తీ చేయాలనే డిమాండుతో ఈనెల 26వ తేదీన బీఈడీ అభ్యర్థులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ వద్ద సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నాను నిర్వహించనున్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో 70 శాతం పోస్టులను ఎస్జీటీ అభ్యర్థులకే ఇస్తున్నారని, దీనివల్ల బీఈడీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి మారాలని, అందుకే ఈ మహా ధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బీఈడీ అభ్యర్థులంతా ఈ ధర్నాకు తరలిరావాలని కోరారు. రాబోయే డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులను వందశాతం డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.
Advertisement
Next Story