ఎన్యుమరేటర్స్‌కు ఫ్యామిలీల వివరాలు ఇవ్వండి: మంత్రి పొన్నం విజ్ఞప్తి

by srinivas |
ఎన్యుమరేటర్స్‌కు ఫ్యామిలీల వివరాలు ఇవ్వండి:  మంత్రి పొన్నం విజ్ఞప్తి
X

దిశ; తెలంగాణ బ్యూరో: కుల గణన కోసం ఎన్యుమరేటర్స్ రాకపోతే వెంటనే పిలిపించుకొని ఆయా ఫ్యామిలీల వివరాలు అందజేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సర్వే బాధ్యత ప్రజలకే ఎక్కువగా ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఈ వివరాలన్నీ భవిష్యత్ ఉపయోగాలకు మేలు చేస్తాయన్నారు. ఈ డేటాతో సంక్షేమ పథకాలు, అభివృద్ధికి చొరవ చూపిస్తామన్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. హైదరాబాద్‌లో పెరిక కులస్తుల కార్తీక వన భోజనాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. కుల సంఘాల ఐక్యత అవసరం అని గుర్తు చేశారు. సమస్యలకు పరిష్కారం చూపడం కోసమే ప్రభుత్వం సమగ్ర ఇంటింటి సర్వే చేబడుతుందన్నారు. ఈ సర్వేలో పెరిక కుల బంధువులు అందరూ పాల్గొనాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం దేశానికి దిక్సూచిగా మారబోతున్నాన్నారు. ఇక ప్రభుత్వం ఏర్పడగానే పెరిక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని రూ.50 కోట్లు కేటాయించుకున్నామన్నారు. యువత ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. కుల గణన పూర్తి చేసుకుంటే పెరిక కులస్తుల్లో ఆర్థికంగా ,సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి జరుగుతుందన్నారు. పదేళ్ల పాటు కేసీఆర్ పెరిక కులస్తులపై వివక్ష చూపించాడని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య మండిపడ్డారు. కుల గణన పూర్తి కాగానే, అన్ని కులాలకు మేలు జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక ప్లాన్ ను అమలు చేయబోతున్నదని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed