- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kawasaki: కవాసకి కీలక నిర్ణయం.. ఈ బైక్ కొనుగోలుపై రూ. 1.14 లక్షల వరకు డిస్కౌంట్..!
దిశ, వెబ్‌డెస్క్: జపాన్(Japan)కు చెందిన స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్(Sports and Adventure) బైక్ తయారీ సంస్థ కవాసకి(Kawasaki) కీలక నిర్ణయం తీసుకుంది. తన ఫ్లాగ్‌షిప్ స్పోర్ట్‌బైక్ 'నింజా జెడ్ఎక్స్-10ఆర్(Ninja ZX-10R)' ధరను గణనీయంగా తగ్గించింది. ఏకంగా రూ. 1.14 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారతీయ మార్కెట్లో(Indian Market)ఈ బైక్ ధర 17.34 లక్షలకు చేరుకుంది. కాగా కవాసకి నింజా జెర్ఎక్స్-10ఆర్ 2025 ఎడిషన్ బైక్ ను ఈ ఏడాది సెప్టెంబర్లో రూ.17.13 లక్షల ప్రారంభ ధరతో దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. మార్కెట్లో అడుగుపెట్టిన కొన్నిరోజులుకు ఈ బైక్ ధరను రూ.18.50 లక్షలకు పెంచింది. కాగా ఇంకో నెల రోజులయితే 2024 ఏడాది ముగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇయర్ ఎండ్(Year End) టైంలో మంచి అమ్మకాలను పొందాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ భారీ డిస్కౌంట్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.
ఇక ఫీచర్ల విషయానికొస్తే.. నింజా జెడ్ఎక్స్-10ఆర్ బైక్ 998 సీసీ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ తో బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వంటివి పొందుతుంది. ఇది 13200 rpm వద్ద 203 హార్స్ పవర్, 11400 Rpm వద్ద 114.9 Nm టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. మరోవైపు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT కన్సోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ ఈ బైక్ లో ఉన్నాయి.