- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డోర్ లాక్, వలసలు వివరాలను సేకరించండి: కలెక్టర్లకు డిప్యూటీ సీఎం ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో: సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకున్నదని, ఈ నేపథ్యంలో డేటా ఎంట్రీ చాలా కీలకమైన దశ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆదివారం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచి నుంచి సమగ్ర కుటుంబ సర్వే వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లుకు పలు సూచనలు చేశారు. డేటా ఎంట్రీ లో నాణ్యత చాలా ముఖ్యమైనదన్నారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తాయని గుర్తు చేశారు. దీంతో అలాంటి వారి వివరాలు సేకరించి, ఫోన్ ల ద్వారా సర్వే చేయాలని సూచించారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో వలసలు, ఇతర ప్రాంతాల్లోకి వెళ్లిన కుటుంబాల వివరాలను జాగ్రత్తగా క్రమబద్దరీకరించుకోవాలన్నారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని,ఆయా పాఠశాలలో ఆహారం , పరిశుభ్రతపై ఫోకస్ పెంచాలన్నారు. విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని మెస్, కాస్మోటిక్స్ చార్జీలను సీఎంరేవంత్ రెడ్డి ప్రభుత్వం డిప్యూటీ సీఎం తెలిపారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రత వంటి అంశాలకు తావు లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి బుర్ర వెంకటేశం, జీహెచ్ ఎంసీ కమిషనర్, అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.