అనకాపల్లి జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. 1500 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్

by srinivas |
అనకాపల్లి జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. 1500 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli district) వాసులకు రాష్ట్ర హోంశాఖ(State Home Department) గుడ్ న్యూస్ తెలిపింది. 1500 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్(Bulk Drug Park) ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ మంత్రి వంగలపూడి అనిత(Minister Wangalapudi Anitha) స్పష్టం చేశారు. ఆ పార్క్‌తో పాటు ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌(ArcelorMittal Steel Plant)నూ అనకాపల్లి జిల్లాలో ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ(Visakha)లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షో(Credai Property Show) ముగింపు కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇందుకు కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తు్న్నట్లు చెప్పారు. గంజాయి నివారణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడంతో పాటు డ్రోన్లను వినియోగిస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed