రవాణా శాఖ నిర్బంధించిన వాహనాలకు వేలం

by Kalyani |
రవాణా శాఖ నిర్బంధించిన వాహనాలకు వేలం
X

దిశ, జనగామ: జనగామ జిల్లా రవాణా శాఖ జప్తు చేసిన వాహనముల బహిరంగ వేలం ఈనెల 17 న వేస్తున్నట్లుగా రవాణా శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మోటార్ సైకిల్స్ 2, 58 ఆటోరిక్షాలు, 13 మ్యాక్స్ క్యాబ్స్, రెండు మోటార్ క్యాబ్స్, 5 గూడ్స్ మొదలగు వాహనములు తేదీ 17 తేదిన వేలంలో అమ్మి వేయుటకు నిర్ణయించడమైనదని తెలిపారు. వేలంలో పాల్గొనదలచిన వారు ధరావత్తు సొమ్ము ముందుగా చెల్లించి వేలంలో పాల్గొనవలసి ఉంటుందని, పై వాహనములను చూడదలచిన వారు రోడ్ రవాణా సంస్థ జనగామ డిపోలోచూచుకోగలరని అలాగే నిబంధలకు అనుగుణంగానే వేలం జరుగుతుందని ప్రకటన ద్వారా తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed