Karnataka Bank PO: పీఓ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కర్ణాటక బ్యాంక్.. డీటెయిల్స్ ఇవే..!

by Maddikunta Saikiran |
Karnataka Bank PO: పీఓ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కర్ణాటక బ్యాంక్.. డీటెయిల్స్ ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్ ఉద్యోగాల(Bank Jobs)కు ప్రిపేర్ అయితున్న వారికి గుడ్ న్యూస్. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్(Karnataka Bank Ltd) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్(PO) పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా https://karnatakabankpo.azurewebsites.net/ ఆన్‌లైన్(Online) విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 10 డిసెంబర్ 2024. బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, పూణే తదితర నగరాల్లో పరీక్షను నిర్వహించనున్నారు.

పోస్టు పేరు, ఖాళీలు:

ప్రొబేషనరీ ఆఫీసర్(Scale-1)

విద్యార్హత:

పోస్టును బట్టి పీజీ/ అగ్రికల్చర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ, ఐదేళ్ల లా, సీఏ, సీఎంఏ ఉతీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు వయసు 1 నవంబర్ 2024 నాటికి 28 ఏళ్లకు మించి ఉండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

ఆన్‌లైన్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 48,480 నుంచి రూ.85,920 జీతం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed