కాసేపట్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

by srinivas |
కాసేపట్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో కాసేపట్లో సన్నబియ్యం(Fine Rice) పంపిణీ కార్యక్రమం ప్రారంభంకానుంది. రేషన్ షాపు(Ration shops)ల్లో ఇస్తున్న 70 నుంచి 80 శాతం రేషన్ బియ్యం పక్కదారి పడుతుందన్న ఆరోపణలకు సైతం ప్రభుత్వం చెక్ పెట్టింది. చాలా పకడ్బందీగా.. పేదలందరూ తినే విధంగా సన్నబియ్యం కార్యక్రమం అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ మేరకు కాసేపట్లో ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించనున్నారు. ఉగాది సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్(Huzurnagar) వేదికగా పేదలకు సన్నబియ్యం కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే మంత్రి ఉత్తమ్ కుమారెడ్డితో సహా మంత్రులంతా హాజరయ్యారు. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం రాష్ర్టంలో అమల్లోకి రానుంది.

ఈ సందర్బంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. సన్నవడ్లకు బోనస్‌గా రూ.500 ప్రకటించామని, ఈ మేరకు ఇస్తున్నామని ఆయన తెలిపారు. వానకాలంలో రికార్డు స్థాయిలో సన్న బియ్యం చేతికి వచ్చిందని, ఇందులో భాగంగా పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. ఏప్రిల్ 1 నుంచి రేషన్ షాపుల్లో ఉచితంగా ఫైన్ రైస్ ఇవ్వబోతున్నామని తెలిపారు. మార్పు ఇది కదా అని అన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 10 లక్షల మందికి సన్న బియ్యం పంపిణీ చేయబోతున్నామని చెప్పారు. ఇప్పటి వరకూ రేషన్ షాపుల్లో ఇస్తున్న బియ్యం 70 నుంచి 80 నుంచి ఇల్లీగల్ దందాలకే పోతోందనే విమర్శలు ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం సమూల మార్పులు తెచ్చిందని చెప్పారు. నూటికి 85 శాతం మంది తినే విధంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Next Story

Most Viewed