అక్రమ బ్లాస్టింగ్ ఆపేదే లేదు.. అడ్డొస్తే అంతు చూస్తాం

by Sumithra |
అక్రమ బ్లాస్టింగ్ ఆపేదే లేదు.. అడ్డొస్తే అంతు చూస్తాం
X

పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అక్రమ వ్యవహారాలకు పాల్పడుతూ పల్లె వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ బ్లాస్టింగులకు పాల్పడుతున్నారు. పేలుళ్ల శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతూ యుద్ద భూమిని తలపిస్తుండగా స్థానికులు బ్లాస్టింగ్స్‌తో బతకలేము బాబోయ్.. అక్రమ బ్లాస్టింగ్ ఆపాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా తగ్గేదే లేదన్నట్టుగా క్రషర్ల నిర్వాహకులు బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. అడ్డు ఎవరు వస్తారో చూస్తాం అన్నట్టుగా వ్యవహరిస్తూ పల్లె ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ఇంత జరిగినా అధికారుల్లో చలనం లేకపోవడంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారుల కనుసన్నల్లోనే అక్రమ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయా ? లేక అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనేది అంతుచిక్కని రహస్యంగా మారింది. మందు గుండు సామాగ్రి రవాణా వాడకం పై ప్రత్యేక ఆంక్షలు ఉన్నప్పటికీ అవి అమలు జరగడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రషర్ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

దిశ బ్యూరో, కరీంనగర్ : పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అక్రమ వ్యవహారాలకు పాల్పడుతూ పల్లె వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నా కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తు బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్నారు. బ్లాస్టింగ్ శబ్దాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతూ యుద్ద భూమిని తలపిస్తుండగా స్థానికులు బ్లాస్టింగ్స్‌తో బతకలేము బాబోయ్.. అక్రమ బ్లాస్టింగ్ ఆపాలంటూ ఆందోళన చేసిన తగ్గేదే లేదన్నట్టుగా బ్లాస్టింగ్‌లు చేస్తున్నారు. అడ్డు ఎవరు వస్తారో చూస్తాం అన్నట్టుగా వ్యవహరిస్తూ పల్లె ప్రజలను భయకంపితులను చేస్తున్నారు. ఇంత జరిగినా అధికారుల్లో చలనం లేకపోవడం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతుంది.

హద్దులు మీరుతూ అక్రమ బ్లాస్టింగ్స్...

క్రషర్ నిర్వహణ పేరుతో కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని కమాన్ పూర్‌లో శ్రీ వెంకటేశ్వర క్రషర్ పేరుతో అనుమతులు పొంది అక్రమ బ్లాస్టింగులకు పాల్పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బ్లాస్టింగ్‌కు అనుమతి లేకపోయిన బ్లాస్టింగ్‌లు చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అక్రమ బ్లాస్టింగులు జరుగుతున్న అధికారులు స్పందించకపోవడం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారుల కనుసన్నల్లోనే అక్రమ బ్లాస్టింగ్స్ జరుగుతున్నాయా లేక అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనేది అంతుచిక్కని రహస్యంగా మారింది. మందు గుండు సామాగ్రి రవాణా వాడకం పై ప్రత్యేక ఆంక్షలు ఉన్నప్పటికీ అవి అమలు జరగడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

బ్లాస్టింగ్‌లు ఆపకపోతే చావే శరణ్యం..

బ్లాస్టింగ్‌లతో బతకలేకపోతున్మామని కమాన్‌పూర్ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్‌లో చేస్తున్న పేలుళ్ల దాటికి ఇళ్లు పగుళ్లు చూపుతున్నాయని వాపోతున్నారు. బ్లాస్టింగ్ చేయడంతో పెద్ద పెద్ద రాళ్లు ఇళ్లు, మనుషుల పై పడి గాయపడుతున్నామని ఆరోపిస్తున్నారు. ఇళ్లలో పశువులు సైతం పేలుళ్ల ధాటికి భయంతో పరుగెత్తుతున్నాయని అంటున్నారు. పేలుళ్లతో వచ్చే పొగ దుమ్ము ధూళితో రోగాల బారిన పడుతున్నామని పేలుళ్లను ఆపమంటే క్రషర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని, అధికారులు సైతం మా మొర ఆలకించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రషర్‌లో బ్లాస్టింగులు ఆపకపోతే తమకు చావే శరణ్యం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల తీరుపై విమర్శలు..

అక్రమ బ్లాస్టింగుల పై ప్రజలు ఆందోళన చెందుతుంటే అరికట్టాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఆఫీసుల్లోనూ వారు కానరాకపోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. ఉన్నతాధికారులను వివరణ కోసం సంప్రదించగా వారు సైతం అందుబాటులోకి రావడం లేదు. అక్రమ బ్లాస్టింగ్‌ల పై మైనింగ్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది.

Next Story

Most Viewed