For Inter students: ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ షురూ.. ఇంతకీ ఎందుకో తెలుసా..?

by Naveena |
For Inter students: ఇంటర్ విద్యార్థులకు టెన్షన్ షురూ.. ఇంతకీ ఎందుకో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీలకు మార్చి 30 నుంచి సమ్మర్ హాలిడేస్ ప్రారంభం అయ్యాయి. అలాగే జూన్ 1 వరకు ఈ సెలవులు కొనసాగుతాయని తెలిపింది. అంటే మార్చి 30 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు వేసవి సెలవులను ఇంటర్ బోర్డు ప్రకటించింది. అయితే కాలేజీలు తిరిగి తెలంగాణ అవతరణ దినోత్సవం నాడు జూన్‌ 2న కాలేజీలు రీ ఓపెన్ అవుతాయని ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలన్నీ వేసవి సెలవులను తప్పనిసరిగా పాటించాలని ఇంటర్ బోర్డు సూచించింది. వేసవి సెలవుల్లో ఏదైనా కాలేజీలు క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

మరోవైపు ఇంటర్ పరీక్షల స్పాట్ వాల్యూయేషన్ వేగవంతంగా జరుగుతుంది. ఏప్రిల్ చివరి వారం వరకు ఫలితాలను విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు సర్వ సిద్ధం చేస్తుంది. స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల సంఖ్యను 17 నుంచి 19 కు అధికారులు పెంచారు. జవాబు పత్రాలను దిద్దేందుకు 14,000 మందిని నియమించామని పేర్కొన్నారు. పరీక్షా ఫలితాల్లో పారదర్శకత పాటించేలా పకడ్బందీ ఏర్పాట్లతో సమాధాన పత్రాలను అధికారులు మూల్యాంకనం చేస్తున్నారు.

Next Story

Most Viewed