రక్తంతో యుద్ధం ప్రారంభమవుతుంది.. ‘వచ్చినవాడు గౌతమ్’ మూవీ వైల్డ్ పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్

by Hamsa |
రక్తంతో యుద్ధం ప్రారంభమవుతుంది.. ‘వచ్చినవాడు గౌతమ్’ మూవీ  వైల్డ్ పోస్టర్‌తో హైప్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ ఓంకార్(Omkar) తమ్ముడిగా అశ్విన్ బాబు(Ashwin Babu) సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆయన నటించిన మొదటి మూవీ ‘రాజు గారి గది’(Raju Gari Gadhi). హారర్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అందరినీ మెప్పించింది. దీంతో దీనికి సీక్వెల్స్ తెరకెక్కించారు. కానీ ఊహించినంతగా మెప్పించలేకపోయాయి. ఇక ఆ తర్వాత అశ్విన్ జత కలిసే, హిడింబ వంటి చిత్రాల్లో నటించాడు. ఇక గత ఏడాది ‘శివం భజే’ సినిమాలతో వచ్చి ప్రేక్షకులను అలరించారు. విభిన్న కథలతో వచ్చినప్పటికీ హిట్స్ అందుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం అశ్విన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వచ్చినవాడు గౌతమ్’(Vachinavaadu Goutam). ఈ సినిమాకు మామిడాల ఎం. ఆర్ కృష్ణ(M. R. Krishna) దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మెడికల్ యాక్షన్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అరుణ శ్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్‌పై మూడవ ప్రాజెక్ట్‌గా రాబోతుంది.

దీనిని టి గణపతి రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో రియా సుమన్, అయేషా ఖాన్, సచిన్ ఖేడేకర్, అభినయ, అజయ్, యెష్మా చౌదరి, సుదర్శన్, మురళీ శర్మ, శకలక శంకర్, అమర దీప్ వంటి వారు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే 90 శాంతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ‘వచ్చినవాడు గౌతమ్’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఇందులో అశ్విన్ బాబు స్టె‌తస్కోప్ పట్టుకుని కోపంగా చూస్తూ చేతులకు మొత్తం రక్తం ఉంది. ఇక ఈ పోస్ట్‌కు మేకర్స్ ‘‘అతని చేతులపై రక్తం & అతని హృదయంలో సత్యంతో, గౌతమ్, యుద్ధం ప్రారంభమవుతుంది. న్యాయం కోసం అతని అన్వేషణ త్వరలో స్టార్ట్ కానుంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం అశ్విన్ బాబు పోస్టర్ నెట్టింట వైరల్ అవుతూ క్యూరియాసిటీని పెంచుతోంది.



Next Story