AP Metro Rail Project : విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్

by M.Rajitha |   ( Updated:2024-12-02 16:34:18.0  )
AP Metro Rail Project : విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు(Visakha, Vijayawada Metro Rail) ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. వైజాగ్ లో మూడు కారిడార్లుగా 46.23 కిమీలుగా.. మెట్రో రైలు నిర్మించేందుకు తొలి దశ డీపీఆర్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిమీల మేర ఒకటవ కారిడార్, గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు 5.08కిమీల మేర రెండవ కారిడార్, తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6.75 కిమీల మేర మూడవ కారిడార్ నిర్మించనున్నారు. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 11,498 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు అనంతరం కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు నిర్మించే ప్లాన్ లో ఉంది. ఇక విజయవాడలో రెండు కారిడార్లుగా 38.67 కిమీల మేర.. మొదటి కారిడార్ ను గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనుమలూరు వరకు రెండవ కారిడార్ ను నిర్మించనున్నారు. ఇక మరో కారిడార్ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు నిర్మించనున్నారు. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు రూ.11,009 కోట్ల వ్యయం అవుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది.

Advertisement

Next Story

Most Viewed