Adani Power: అదానీ పవర్ నుంచి విద్యుత్ కొనుగోలును సగానికి తగ్గించిన బంగ్లాదేశ్

by S Gopi |
Adani Power: అదానీ పవర్ నుంచి విద్యుత్ కొనుగోలును సగానికి తగ్గించిన బంగ్లాదేశ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: డిమాండ్ తగ్గిన కారణంగా గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్‌తో విద్యుత్ కొనుగోలును సగానికి తగ్గించినట్టు బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారులు తెలిపారు. గత కొంతకాలంగా అదానీ గ్రూప్‌నకు చెల్లించాల్సిన బకాయిల అంశంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం చర్చనీయాంశం అయింది. ఇప్పటికే గౌతమ్ అదానీపై అమెరికాలో లంచం ఆరోపణలు రావడంతో అదానీ గ్రూప్ విదేశీ మారకద్రవ్య కొరత కారణంగా బంగ్లాదేశ్‌కు విద్యుత్ సరఫరాను తగ్గించింది. దీని తర్వాత బంగ్లాదేశ్ సైతం వివిధ కారణాలతో అదానీ సంస్థకు సగం విద్యుత్ మాత్రమే సరఫరా చేయాలని కోరింది. అయితే, పాత బకాయిలను చెల్లిస్తూనే ఉంటామని బంగ్లాదేశ్ ప్రభుత్వాధికారులు స్పష్టం చేశారు. అదానీ గ్రూప్ మొదట విద్యుత్ సరఫరాను నిలిపెసినప్పుడు ఆశ్చర్యపోయాం. కానీ ఇప్పుడు శీతాకాలం వల్ల డిమాండ్ తగ్గింది. కాబట్టి రెండు ప్లాంట్లను నిర్వహించాల్సిన అవసరం లేదని బంగ్లాదేశ్ పవర్ డెవలప్‌మెంట్ బోర్డ్ ఛైర్‌పర్సన్ మహమ్మద్ రెజాల్ కరీమ్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed