Avadh Ojha: ఆప్‌లో చేరిన అవధ్ ఓజా.. అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం

by vinod kumar |
Avadh Ojha: ఆప్‌లో చేరిన అవధ్ ఓజా.. అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: యూపీఎస్సీ పరీక్షల కోచింగ్ ఫ్యాకల్టీగా గుర్తింపు పొందిన అవధ్ ఓజా (Avad Ojha) ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) లో జాయిన్ అయ్యారు. పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal), పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా (Manish sisodiya)ల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘ఓజా అనుభవం, దృక్పథం ఆప్ విద్యా విధానానికి దిశానిర్దేశం చేస్తుంది. మా విధానాలు, విద్యపై చేసిన కృషితో ప్రేరణ పొంది ఆయన పార్టీలో చేరారు’ అని తెలిపారు. లక్షలాది మంది యువతకు ఓజా స్పూర్తి నిచ్చారని కొనియాడారు. అవధ్ మాట్లాడుతూ.. విద్యాభివృద్ధికి కృషి చేసేందుకే రాజకీయాల్లోని వస్తున్నట్టు తెలిపారు. సరైన విద్య అందినప్పుడే దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు. కాగా, గత 22ఏళ్లుగా ఓజా సివిల్ సర్వీసెస్ పరీక్షల కోచింగ్ ఇస్తున్నాడు. సోషల్ మీడియా ఫాలోవర్లు సైతం లక్షల్లో ఉన్నారు. దీంతో ఆయన దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. కాగా, 2025 ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓజా ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.



Next Story

Most Viewed