- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Banks: నిర్వహణలో లేని అకౌంట్లను తక్షణం తొలగించాలని బ్యాంకులను కోరిన ఆర్‌బీఐ
దిశ, బిజినెస్ బ్యూరో: పనిచేయకుండా ఉండిపోయిన, ఫ్రీజ్ అయిన అకౌంట్లను తక్షణం నిలిపేయాలని, వచ్చే త్రైమాసికానికి వారి సంఖ్యను తగ్గించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) సోమవారం బ్యాంకులను కోరింది. ఆయా ఖాతాల్లో పెరుగుతున్న నగదుపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్‌బీఐ, తమ తనిఖీల్లో పనిచేయకుండా ఉండిపోతున్న అకౌంట్ల వల్ల ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించింది. చాలా బ్యాంకుల్లో పనిచేయని, క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య వాటి మొత్తం డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉన్నట్టు ఆర్‌బీఐ సూపర్‌విజన్ డిపార్ట్‌మెంట్ కనుగొంది. వాటిని తగ్గించేందుకు లేదా వాటి వల్ల సమస్యలు తలెత్తకుండా చూసేకునేందుకు తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంకులను సూచించినట్టు ఆర్‌బీఐ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది. దానికోసం మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, నాన్-హోమ్ బ్రాంచ్‌లు, వీడియో కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ ద్వారా కేవైసీ అప్‌డేట్ ద్వారా దీన్ని అధిగమించవచ్చని ఆర్‌బీఐ సూచించింది.