- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : పార్లమెంటులో ‘ది సబర్మతీ రిపోర్ట్’ను వీక్షించిన మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో జరిగిన గోద్రా రైలు దహనకాండను ఆధారంగా చేసుకొని తీసిన ‘ది సబర్మతీ రిపోర్ట్’ సినిమాను సోమవారం మధ్యాహ్నం పార్లమెంటు లైబ్రరీ భవనంలోని బాలయోగి ఆడిటోరియంలో ప్రధాని మోడీ(PM Modi) వీక్షించారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, జేపీ నడ్డాతో పాటు పలువురు ఎన్డీయే కూటమి ఎంపీలు ఈ మూవీని చూశారు. ‘ది సబర్మతీ రిపోర్ట్’(The Sabarmati Report)లో కీలక పాత్ర పోషించిన నటులు జితేంద్ర, రాశీ ఖన్నా, విక్రాంత్ మసీ కూడా ప్రధానితో పాటు మూవీని వీక్షించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీతో కలిసి తాము నటించిన సినిమాను చూసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
దేశ ప్రధాని అయిన తర్వాత మళ్లీ సినిమాను చూడటం ఇదే తొలిసారి అని తమతో ప్రధాని మోడీ చెప్పారని జితేంద్ర, రాశీ ఖన్నా తెలిపారు. ‘‘నా కూతురు ఏక్తా కపూర్ ది సబర్మతీ రిపోర్ట్ సినిమాకు ప్రొడ్యూసర్. ఆమె వల్లే నేను ప్రధాని మోడీతో కలిసి సినిమాను చూడగలిగాను’’ అని జితేంద్ర చెప్పారు. కాగా, 2002లో ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రా రైల్వేస్టేషన్‌లో అల్లర్లు చెలరేగాయి. గోద్రా నుంచి అహ్మదాబాద్‌కు వెళ్లేందుకు సబర్మతీ ఎక్స్‌ప్రెస్ కదలుతుండగా ఎవరో చైన్ లాగడంతో అకస్మాత్తుగా ఆగింది. ఒక్కసారిగా కొన్ని బోగీలపైకి దుండగులు రాళ్లు రువ్వారు. ఇంకొందరు దుండగులు బోగీలపై పెట్రోలు చల్లి నిప్పు పెట్టారు. దీంతో పలు బోగీలలోని 59 మంది చనిపోయారు. ఈ ఘటనను ఆధారంగా చేసుకుని బాలీవుడ్ దర్శకుడు ధీరజ్ సర్నా ‘ది సబర్మతీ రిపోర్ట్’ను తెరకెక్కించారు.