Mandaviya: ఆప్ నేతలు మద్యం అమ్మకాల్లో బిజీ.. కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయ విమర్శలు

by vinod kumar |
Mandaviya: ఆప్ నేతలు మద్యం అమ్మకాల్లో బిజీ.. కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూర్: కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా(Mansukh mandaviya) ఆమ్ ఆద్మీ పార్టీ (Aap) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ (Ayushman Bharat) పథకాన్ని అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడానికి బదులుగా వారు మద్యం అమ్మకాల్లో బిజీ అయిపోయారని విమర్శించారు. సోమవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ వయ వందన ( Ayushman Vaya vandhana) వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఢిల్లీ ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలన్నారు. కానీ ఆప్ ప్రభుత్వం వీటిని అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన వారు దీనిని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆప్ నేతలు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. కాగా, ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్, ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB-PMJAY)ని అమలు చేయాలని కోరుతూ పలువురు బీజేపీ నేతలు ఢిల్లీ హైకోర్టు(Delhi high court) లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయడంలో వైఫల్యంపై వివరణ ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మాండవీయ స్పందించి ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Advertisement

Next Story