Israel: ఇజ్రాయెల్ 54 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది.. లెబనాన్ స్పీకర్ నబీహ్ బెర్రీ

by vinod kumar |
Israel: ఇజ్రాయెల్ 54 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది.. లెబనాన్ స్పీకర్ నబీహ్ బెర్రీ
X

దిశ, నేషనల్ బ్యూరో: హిజ్బుల్లా (Hezbollah), ఇజ్రాయెల్ (Israel) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ అగ్రిమెంట్‌పై లెబనాన్ స్పీకర్ నబీహ్ బెర్రీ (Nabeeh berry) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయెల్ 54 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని ఆరోపించారు. వాటిని ఆపడానికి అంతర్జాతీయ దేశాలు జోక్యం చేసుకోవాలని తెలిపారు. సోమవారం ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఇజ్రాయెల్ దూకుడు చర్యలు సరికావని నొక్కి చెప్పారు. కాల్పుల విరమణను పర్యవేక్షిస్తున్న టెక్నికల్ కమిటీ తక్షణమే చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

లెబనాన్ భూభాగాల నుంచి ఇజ్రాయెల్ సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఉల్లంఘనలను ఆపాలని సూచించారు. లెబనాన్, హిజ్బుల్లా కాల్పుల విరమణ నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా, పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా, ఫ్రాన్స్ మధ్య వర్తత్వంతో ఇజ్రాయెల్, మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఇరుపక్షాలు దీనికి అంగీకరించగా ఈ అగ్రిమెంట్ నవంబర్ 27 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘించి పలు ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతోందని లెబనాన్ ఆరోపిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed